Accident | సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ – బీదర్ రహదారిపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. బైక్, కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తండ్రి, కుమార్తె, అల్లుడు, మనువడు మృతి చెందారు. వీరంతా పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
KTR | పనిమంతుడని పందిరేపిస్తే.. పిల్లి తోక తగిలి కూలిందట.. రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
TG EAPCET | టీజీ ఎప్‌సెట్ బైపీసీ విద్యార్థులకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Handloom worker | సిరిసిల్ల పట్టణంలో మరో చేనేత కార్మికుడు ఆత్మహత్య