రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు(Commits suicide) కొనసాగుతూనే ఉన్నాయి. ఉపాధి లేక, ప్రభుత్వం సాయం అందక నేతన్నలు ఉరితాళ్లను ఆశ్రయిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన చేనేత పరిశ్రమ నేడు కాంగ్రెస్ పాలనలో కునారిల్లిపోయింది. రోజురోజుకు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా సిరిసిల్ల పట్టణంలో మరో చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సిరిసిల్ల పట్టణం(Siricilla town) కేసీఆర్ నగర్‌కు చెందిన సిరిమల్ల శ్రీధర్(34) అనే నేత కార్మికుడు (Handloom worker) ఇంటర్ వరకు చదివి సాంచాలు నడుపుకుంటూ తల్లిదండ్రులతో ఉంటున్నాడు. కాగా, ఈ మధ్యకాలంలో సాంచాల పని బంద్ కావడంతో చేతిలో డబ్బులు లేక తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీధర్ మృతితో కేసీఆర్ నగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని యువ నేతన్న ఆత్మహత్య
సిరిసిల్ల పట్టణం పెద్దూరులోని కేసీఆర్ నగర్‌కు చెందిన సిరిమల్ల శ్రీధర్(34) ఇంటర్ వరకు చదివి సాంచాలు నడుపుకుంటూ తల్లిదండ్రులతో ఉంటున్నాడు.
ఈ మధ్యకాలంలో సాంచాల పని బంద్ కావడంతో, చేతిలో డబ్బులు లేక తీవ్ర మనస్తాపంతో, ఇంట్లో ఎవరూ… pic.twitter.com/J9u2nIaDJA
— Telugu Scribe (@TeluguScribe) October 7, 2024