TG EAPCET | హైదరాబాద్ : టీజీ ఎప్‌సెట్ బైపీసీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. బీ ఫార్మసీ, ఫార్మ్ డీ, బయో టెక్నాలజీ, బయో మెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 19 నుంచి 22వ తేదీ లోపు ప్రాసెసింగ్ ఫీజు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు 21 నుంచి 23వ తేదీ లోపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి కానుంది. 21 నుంచి 25 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 28వ తేదీన సీట్ల కేటాయింపు జరగనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు 28 నుంచి 30వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుని, ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
నవంబర్ 4వ తేదీన ప్రాసెసింగ్ ఫీజు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 5వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. నవంబర్ 9న సీట్ల కేటాయింపు జరగనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు నవంబర్ 9 నుంచి 11వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుని, ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 11, 12 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. నవంబర్ 12వ తేదీన స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి నిబంధనలు విడుదల కానున్నాయి. తదితర వివరాల కోసం https://tgeapcetb.nic.in/default.aspx ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
ఇవి కూడా చదవండి..
TG Rains | తెలంగాణలో రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు..!
Balka Suman | అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి.. బాల్క సుమన్ తీవ్ర విమర్శలు