కారేపల్లి,జనవరి 22 : ఖమ్మం జిల్లా కారేపల్లి(Karepalli) మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు జడల వెంకటేశ్వర్లు ఇటీవల కాలంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు( Nama Nageswara Rao )గురువారం కారేపల్లి బస్టాండ్ సెంటర్ లోని జడల నివాసానికి చేరుకొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. వెంకటేశ్వర్లు సతీమణి మాజీ ఎంపీటీసీ జడల వసంత, కుమారుడు జడల కళ్యాత్తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అధైర్యపడొద్దు అండగా ఉంటామన్నారు. నామా వెంట స్థానిక బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Ritu Chowdary | బిగ్ బాస్ ఫేం రీతూ చౌదరి పెళ్లి, బ్రేకప్‌పై ఓపెన్ … “రిలేషన్షిప్ ఒక మెంటల్ టార్చర్”
Maruthi | ‘ది రాజాసాబ్’ డిజాస్టర్ తర్వాత మారుతీ కొత్త ప్లాన్.. మెగా హీరోతో కంబ్యాక్‌కు సిద్ధం!
Road accident | బైక్‌ను ఢీ కొట్టిన కారు.. ఇద్దరు వ్యక్తులు దుర్మరణం