ములుగు : ములుగు జిల్లాలో(Mulugu district) అటవీ శాఖ అధికారులపై(Forest department) దుండగులు దాడికి(Attacked) పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. వివరాల్లోకి వెళ్తే..తాడ్వాయి అటవీ రేంజ్ దామరవాయి అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లను నరికి వేస్తున్నారనే సమాచారం మేరకు అటవీశాఖ సిబ్బంది ఎఫ్ఎస్వో వినోద్, ఎఫ్‌బీవో శరత్ చంద్ర, సుమన్ బృందం సంఘటన స్థలానికి చేరుకొని చెట్లను తొలగిస్తున్న జేసీబీని స్వాధీనం చేసుకున్నారు.
జేసీబీని తాడ్వాయి అటవీ కార్యాలయానికి తరలిస్తుండగా తాడ్వాయి సమీపంలో జేసీబీ ఓనర్ గంట సూరజ్ రెడ్డి (గున్ను ), మరో ఇద్దరితో కలిసి అటవీ అధికారులపై విచక్షణా రహితంగా ఇనుప రాడ్లతో దాడి చేశారు. జీప్ లైట్లను ధ్వంసంచేసి జేసీబీని తీసుకెళ్లారు.ఈ దాడిలో ఎఫ్ఎస్వో వినోద్, శరత్ చంద్రకు తీవ్ర గాయా లయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Prakash Raj | గెలిచే ముందొకటి.. గెలిచిన తర్వాత ఇంకోటి.. పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ ఫైర్
Jani Master | రెండో రోజు విచారణ.. షూటింగ్ స్పాట్స్‌కు జానీ మాస్టర్.. !