నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్(Nagarkurnool) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్ బోల్తా పడటంతో విద్యార్థులకు(Students injured )గయాయలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. బిజినేపల్లి మండలానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు 20 మంది విద్యార్థులతో స్కూల్కు వెళ్తుండగా.. ట్రాక్టర్ ఢీ కొట్టడంతో పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్ న్యూస్
స్కూల్ బస్సు బోల్తా.. ఐదుగురు చిన్నారులకు గాయాలు
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు 20 మంది విద్యార్థులతో వెళ్తుండగా, ట్రాక్టర్ ఢీ కొట్టడంతో, పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు… pic.twitter.com/1pWaGQQSUI
— Telugu Scribe (@TeluguScribe) November 20, 2024