పాలకుర్తి, జనవరి 23: ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలు(Baby goats) జన్మించిన ఘటన జనగామ(Jangaon) జిల్లా పాలకుర్తి మండలంలోని మల్లంపల్లిలో గురువారం చోటుచేసుకుంది. సాధారణంగా మేక ఒకటి లేదా రెండు పిల్లలకు జన్మనిస్తుంది. గ్రామానికి చెందిన మేకల కాపరి దేవరాయ సాయిలు-లక్ష్మి దంపతులకు చెందిన మేకకు ఒకే కాన్పులో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో నాలుగు ఆడవి కాగా, ఒకటి మగ పిల్ల ఉంది. పిల్లలన్నీ ఆరోగ్యం ఉండి చెంగుచెంగునా దుంకుతుంటే వీటిని చూడడానికి గ్రామస్తులు ఆసక్తి కనబరిచారు.
ఇవి కూడా చదవండి..
Mahabubabad | ఇందిరమ్మ పథకం, ఈ పథకం, ఆ పథకం, బొంగు భోషాణం.. అధికారులపై మహిళ ఫైర్
Congress | ఇందిరమ్మ రాజ్యంలో మృత్యు ఘోష.. ప్రజల ప్రాణాలు తీస్తున్న కాంగ్రెస్ పథకాలు
Mulugu | ఇందిరమ్మ ఇల్లు రాలేదని పురుగుల మందు తాగిన వ్యక్తి.. హాస్పిటల్కు తరలింపు