మహబూబాబాద్ : గ్రామ సభల్లో(Grama Sabha) అధికారులు, ప్రజా ప్రతినిధులకు జనం చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు చేపట్టిన గ్రామ సభల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై నిలదీస్తూ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. అనర్హులకు పథకాల కేటాయింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మహబూబాబాద్(Mahabubabad) జిల్లా దర్గా తండా గ్రామ సభలో ఓ మహిళ అధికారుల అలసత్వంపై ఫైర్ అయింది.
‘‘పథకాలు అంటే మేము ఉద్యోగానికి లీవ్ పెట్టుకుని వస్తాం, మీకేమో 10 నిమిషాలు కూర్చోవడానికి ఓపిక ఉండదు. ఇందిరమ్మ పథకం, ఈ పథకం, ఆ పథకం, బొంగు భోషాణం మీరేం ఆఫీసర్లో ఏంటో అంటూ అధికారులను ఉతికారేసింది. ఎన్నిసార్లు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు పెట్టుకోవాలని నిప్పులు చెరిగింది. ఇప్పుడు ఈ విడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇందిరమ్మ పథకం, ఈ పథకం, ఆ పథకం, బొంగు భోషాణం
పథకాలు అంటే మేము ఉద్యోగానికి లీవ్ పెట్టుకుని వస్తాం, మీకు ఏమో 10 నిమిషాలు కూర్చోవడానికి ఓపిక ఉండదు మీరేం ఆఫీసర్లో ఏంటో
మహబూబాబాద్ జిల్లా దర్గా తండా గ్రామ సభలో అధికారులను తిట్టిన మహిళ
గ్రామ సభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు – 77 https://t.co/NwxWphkzd7 pic.twitter.com/qSWUOuG6Lm
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2025