ములుగు : రాష్ట్రంలో కొనసాగుతున్న గ్రామ సభలు(Grama sabha) ప్రజలు ప్రాణాలను తీస్తున్నది. నాలుగు ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం, అధికారుల నిర్లక్ష్యం, లంచాలు తీసుకొని పేర్లు నమోదు చేసుకుండటంతో అసలైన అర్హులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. తాజాగా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో జరిగిన గ్రామసభలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో కొత్తూరు గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వర్ రావు అనే రైతు గ్రామ సభ వద్ద పురుగుల మందు తాగాడు(Man drinks pesticide).
అందరు కాంగ్రెస్ వాళ్లకే ప్రభుత్వ పథకాలు వచ్చాయని అధికారులను నిలదీశాడు. అనంతరం పురుగుల ముందు తాగాడు. నాగేశ్వరరావును అధికారులు ఎటూరు నాగారానికి తరలించారు. ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ములుగు జిల్లా కేంద్రంలోని వైద్యశాలకు తరలించారు. ప్రజలను ఆదోకోవాల్సిన ప్రభుత్వ పథకాలు వారి ప్రాణాలను తీస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..