ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది కౌన్సిలింగ్

వరంగల్ అర్బన్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాల్లో ప్రవేశాలకు తుది విడత కౌన్సిలింగ్ (మాప్ అప్) నోటిఫికేషన్ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ నెల 26న వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 26న సాయింత్రం 7 గంటల నుంచి 27 సాయంత్రం 6 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని వారు సూచించారు.
యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొనాలని పేర్కొన్నారు. గత విడత కౌన్సెలింగ్లో సీటు అలాట్ అయి జాయిన్ కానీ అభ్యర్థులు, అదే విధంగా కళాశాలలో చేరి డిస్కంటిన్యూ చేసిన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్కు అనర్హులుగా పరిగణించబడుతారు. అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులను కూడా ఈ వెబ్ కౌన్సెలింగ్కు అనర్హులుగా పరిగణిస్తారని తెలిపారు. ఇతర వివరాలకు www.knruhs.telangana.gov .in వెబ్ సైట్లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.
తాజావార్తలు
- ఆంబోతుల ఫైట్.. పంతం నీదా..? నాదా..?
- పోలీసు మానవత్వం.. మూగజీవాన్ని కాపాడాడు..
- ప్రముఖ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య.. నెల్లూరు టౌన్లో కలకలం
- తెలంగాణ కశ్మీరం @ ఆదిలాబాద్
- అనుకోకుండా కలిసిన 'గ్యాంగ్ లీడర్' బ్రదర్స్
- హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
- లాఠీ వదిలి క్రికెట్ బ్యాట్ పట్టిన సీపీ
- 15 గంటలపాటు సాగిన భారత్-చైనా మిలటరీ చర్చలు
- బిగ్ బాస్ ఎఫెక్ట్.. హారికకు వరుస ఆఫర్స్
- ఐటీలో ఆదా ఇలా.. ఆ మినహాయింపులేంటో తెలుసా?