హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఆరుగాలం శ్రమించి అష్టకష్టాలు పడి పంటలు పండిస్తే కొనే నాథుడు లేక రైతులు అడ్డికి పావుశేరు దళారులకు అమ్ముకుంటున్నారు. నెల రోజుల నుంచి ధాన్యం వస్తున్నా పట్టించుకునే వారు లేక రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. మరోవైపు రైతులు ప్రైవేట్ మిల్లర్లకు(Private millers) సన్న ధాన్యం(Grain purchase) అమ్మేస్తున్నారు. రూ.500 బోనస్ ఇస్తామన్న కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల దగ్గరి వెళ్లడం లేదు.
కొసరు కోసం చూస్తే అసలుకే నష్టం వస్తుందుని, రూ.500 బోనస్ కోసం చూస్తే.. తేమ 17% ఉండాలి. దానికోసం ఆరబెడితే క్వింటాల్‌కు ఆరు నుంచి ఏడు కిలోల వరకు బరువు తగ్గుతుంది. ఆరబెట్టే పని, అకాల వర్షం భయం, డబ్బు కోసం వేచి చూడాలని.. ఈ రిస్క్ తీసుకోకుండా ప్రైవేటు మిల్లులకు సన్న ధాన్యం అమ్ముతున్నారు. కాగా, బీఆర్ఎస్ హయాంలో వడ్లు కొంటే వారం, పది రోజుల్లోనే డబ్బులు అకౌంట్లో పడేవి. ఇప్పడు చూస్తుంటే బాధ అనిపిస్తున్నదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.