Orange Peels | నారింజ పండు తొక్కలను చాలా మంది పడేస్తుంటారు. పండ్లను తిన్న తరువాత తొక్కలను పడేస్తారు. అయితే వాస్తవానికి ఈ తొక్కల్లోనూ అనేక పోషకాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలా మందికి అవగాహన పెరిగింది. నారింజ పండు తొక్కలను పడేయడం లేదు. వాటిని ఏదో ఒక విధంగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే నారింజ పండు తొక్కల వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నారింజ పండు తొక్కలను మనం తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ తొక్కలను తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీంతో వాపులు తగ్గిపోతాయి. దీని వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే నాడీ సంబంధ వ్యాధులు రావు.
అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ అనే ఓ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం నారింజ పండు తొక్కలను తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుందని వెల్లడైంది. నారింజ పండు తొక్కల్లో విటమిన్లు అనేకం ఉంటాయి. ఈ తొక్కల్లో పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. నారింజ పండు తొక్కల్లో పెక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రంగా ఉంటుంది.
నారింజ పండు తొక్కలను తినడం వల్ల వాటిల్లో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర కలిసే వేగాన్ని తగ్గిస్తుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానలో మేలు చేసే విషయం. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. నారింజ పండు తొక్కలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. రోజూ వ్యాయామం చేస్తూ ఈ తొక్కలను తీసుకుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. దీని వల్ల బరువును వేగంగా తగ్గించుకోవచ్చు.
మొటిమలు, జిడ్డు చర్మం సమస్యలను తగ్గించడంలో నారింజ పండు తొక్కలు ఎంతో మేలు చేస్తాయి. మూసుకుపోయిన చర్మ రంధ్రాలను ఇవి ఓపెన్ చేస్తాయి. దీంతో అధికంగా ఉన్న జిడ్డు పోతుంది. అలాగే చర్మం పగిలిపోకుండా ఉంటుంది. చలికాలంలో ఈ తొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి చర్మాన్ని పగలనీయవు. నారింజ పండు తొక్కల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి గాయాలు, పుండ్లను త్వరగా మానేలా చేస్తాయి. దీంతోపాటు చర్మంపై ఉండే దురదను, దద్దుర్లను తగ్గిస్తాయి. నారింజ పండ్ల తొక్కను కొందరు ఆస్తమా, బ్రాంకైటిస్, దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించేందుకు ఔషధంగా ఉపయోగిస్తారు. కనుక ఈ తొక్కలను వాడితే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నారింజ పండు తొక్కల్లో ఉండే సమ్మేళనాలను ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని కరిగిస్తాయి. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది.
నారింజ పండు తొక్కలను నేరుగా తినలేరు. కనుక వాటిని నీడలో ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని వాడుకోవచ్చు. దాంతో డికాషన్ తయారు చేసి తాగవచ్చు. ఇలా తాగడం వల్ల కూడా పైన చెప్పిన ప్రయోజనాలు కలుగుతాయి.