US Elections 2024 | ట్రంప్‌కు 230.. హారిస్‌కు 210.. ఉత్కంఠ భరితంగా యూఎస్ ఎన్నికల ఫలితాలు
US Elections 2024 | అమెరికా అధ్యక్ష ఎన్నికల (US ELECTIONS) ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ (Kamala Harris) మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది.
US Elections 2024 | అమెరికా అధ్యక్ష ఎన్నికల (US ELECTIONS) ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ (Kamala Harris) మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. తొలుత ట్రంప్ హవా కొనసాగించినప్పటికీ.. హారిస్ అనూహ్యంగా పుంజుకుని మాజీ అధ్యక్షుడికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఇద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. డొనాల్డ్ ట్రంపే ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు 230 ఎలక్టోరల్ ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. మొత్తం 24 రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేశారు. మోంటానా, యుటా, నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకౌటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మెస్సోరీ, మిస్సీసిప్పి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, కాన్సస్, అయోవా, ఐడహో, నార్త్ కరోలినా రాష్ట్రాలను ట్రంప్ కైవసం చేసుకున్నారు.
ఇక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ సైతం ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తూ ఫలితాల్లో తన హవా కొనసాగిస్తున్నారు. కాలిఫోర్నియా, ఓరెగన్, వాషింగ్టన్, న్యూ మెక్సికో, వర్జీనియా, ఇల్లినాయిస్, న్యూజెర్సీ, మేరీలాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలవేర్, మాసాచుసెట్స్, రోడ్ ఐలాండ్, కొలరాడో, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాతోపాటు మొత్తం 17 రాష్ట్రాల్లో 210 ఎలక్టోరల్ ఓట్లు కైవసం చేసుకున్నారు. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గెలవాలంటూ 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం.
బ్లూ వాల్ ను ట్రంప్ బ్రేక్ చేస్తారా?
ట్రంప్ అధ్యక్షుడు కావాలంటే ‘బ్లూ వాల్’ను బ్రేక్ చేయాల్సిందే అని అంటున్నారు అమెరికా పొలిటికల్ పండిట్లు. సంప్రదాయంగా డెమోక్రటిక్ పార్టీకి మద్దతిచ్చే రాష్ర్టాలను ‘బ్లూవాల్’ స్టేట్స్ అంటారు. ఇవి 18 రాష్ర్టాలు ఉన్నాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినాయిస్, పెన్సిల్వేనియా, మిషిగన్, న్యూజెర్సీ, వాషింగ్టన్, మసాచుసెట్స్, మేరీల్యాండ్, మిన్నెసోటా, విస్కాన్సిన్, ఓరెగావ్, కనెక్టికట్, హవాయ్, మైనె, రోడ్ ఐలాండ్, డెలావర్, వెర్మాంట్ రాష్ర్టాలను బ్లూ వాల్ స్టేట్స్ అంటారు. వీటిల్లో 238 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు కావాలి. కాబట్టి, ఈ బ్లూవాల్ స్టేట్లను కనుక కమలా హారిస్ నిలుపుకోగలిగితే అధ్యక్షురాలు కావడం సులభం. ట్రంప్ గెలవాలంటే ఈ 18 రాష్ర్టాల్లో కొన్నింటినైనా తన వైపు తిప్పుకోవాలి.
డిసెంబర్ 11నే ఫైనల్ రిజల్ట్!
భారత్‌లా అమెరికాలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ లాంటిది లేదు. ఆయా రాష్ర్టాలే ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తాయి. ఎన్నికల కౌంటింగ్ పూర్తి చేసి ప్రకటించేందుకు డిసెంబరు 11 వరకు సమయం ఉంటుంది. అధికారికంగా ఫలితాలు వెలువడేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ ముందుగా మీడియా సంస్థలు నాలుగైదు రోజుల్లో ఫలితాలను అంచనా వేయవచ్చు.
Also Read..
Raja Krishnamoorthi | ఇల్లినాయిస్లో భారతీయ అమెరికన్ రాజా కృష్ణమూర్తి విజయం
US Elections | హోరాహోరీ పోరు.. ట్రంప్, కమల హ్యారిస్‌కు సమాన ఓట్లు వస్తే ఎలా?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

