Raja Krishnamoorthi | అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. మొత్తం 230 ఓట్లతో గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఇక అమెరికా ప్రతినిధుల సభకు సంబంధించి ఆయా రాష్ర్టాల్లో ఖాళీ అయిన స్థానాలకు అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. 9 మంది భారతీయ అమెరికన్లు ఎన్నికల బరిలో నిలబడిన విషయం తెలిసిందే.
ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి (Raja Krishnamoorthi) హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో విజయాన్ని అందుకున్నారు. ఇల్లినాయిస్ (Illinois)లో 8 వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ (8th Congressional District) నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి మార్క్ రిక్ పై దాదాపు 30 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు.
2016లో తొలిసారి ఆయన అక్కడి నుంచి ప్రతినిధుల సభకు వెళ్లారు. సెలక్ట్ కమిటీ ఆన్ చైనీస్ కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా పని చేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న కృష్ణమూర్తి ఇల్లినాయిస్లో పలు పదవులు నిర్వహించారు. స్టేట్ ట్రెజరర్‌గా కూడా ఆయన సేవలు అందించారు. మూడుసార్లు ఎంపీగా ఉన్న రాజా కృష్ణమూర్తి.. అమెరికా సెనేట్‌లోని ఇంటెలిజెన్స్ సెలెక్ట్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
Also Read..
US Elections 2024 | కొనసాగుతున్న ట్రంప్ దూకుడు.. 198 సీట్లతో ముందజ
US Elections 2024 | ఉత్కంఠగా అమెరికా అధ్యక్ష పోరు.. దూసుకెళ్తున్న ట్రంప్
US Elections | హోరాహోరీ పోరు.. ట్రంప్, కమల హ్యారిస్‌కు సమాన ఓట్లు వస్తే ఎలా?