US Elections 2024 | ఉత్కంఠగా అమెరికా అధ్యక్ష పోరు.. దూసుకెళ్తున్న ట్రంప్
US Elections 2024 | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్ట్ ట్రంప్, కమలా హ్యారీస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఒక పక్క పోలింగ్ ప్రక్రియ సాగుతుండగానే.. మరో పక్క కౌంటింగ్‌ను మొదలుపెట్టేశారు. భారత కాలమాన ప్రకారం ఇవాళ ఉదయం 11.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
US Elections 2024 | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్ట్ ట్రంప్, కమలా హ్యారీస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఒక పక్క పోలింగ్ ప్రక్రియ సాగుతుండగానే.. మరో పక్క కౌంటింగ్‌ను మొదలుపెట్టేశారు. భారత కాలమాన ప్రకారం ఇవాళ ఉదయం 11.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. దీంతో పోలింగ్ పూర్తయిన కేంద్రాల్లో కౌంటింగ్‌ను ప్రారంభించారు. ఉదయం 7 గంటల వరకు సాగిన కౌంటింగ్ ప్రక్రియ ప్రకారం ట్రంప్ ముందంజలో ఉన్నారు.
ప్రస్తుతానికి ట్రంప్ 10 రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఇండియానా, కెంటకీ, వెస్ట్ వర్జీనియా, మిస్సౌరి, ఫ్లోరిడా, మిస్సిసిప్పి, సౌత్ కరోలినా, టెన్నెసీ, అలబామా, ఓక్లహామాలో ట్రంప్ గెలుపొందారు. దీంతో ట్రంప్‌నకు 101 ఎలక్టోరల్ సీట్లు లభించాయి.ఇక 8 రాష్ట్రాల్లో కమలా హ్యారీస్ ఆధిక్యం కనబరిచారు. మేరీలాండ్, మస్సాచుసెట్స్, కనెక్టికట్, న్యూజెర్సీ, రోడ్ ఐలాండ్, వెర్మాంట్‌లో కమల విజయం సాధించారు. దీంతో కమలకు 71 ఎలక్టోరల్ సీట్లు లభించాయి.
బ్లూ వాల్ ను ట్రంప్ బ్రేక్ చేస్తారా?
ట్రంప్ అధ్యక్షుడు కావాలంటే ‘బ్లూ వాల్’ను బ్రేక్ చేయాల్సిందే అని అంటున్నారు అమెరికా పొలిటికల్ పండిట్లు. సంప్రదాయంగా డెమోక్రటిక్ పార్టీకి మద్దతిచ్చే రాష్ర్టాలను ‘బ్లూవాల్’ స్టేట్స్ అంటారు. ఇవి 18 రాష్ర్టాలు ఉన్నాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినాయిస్, పెన్సిల్వేనియా, మిషిగన్, న్యూజెర్సీ, వాషింగ్టన్, మసాచుసెట్స్, మేరీల్యాండ్, మిన్నెసోటా, విస్కాన్సిన్, ఓరెగావ్, కనెక్టికట్, హవాయ్, మైనె, రోడ్ ఐలాండ్, డెలావర్, వెర్మాంట్ రాష్ర్టాలను బ్లూ వాల్ స్టేట్స్ అంటారు. వీటిల్లో 238 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు కావాలి. కాబట్టి, ఈ బ్లూవాల్ స్టేట్లను కనుక కమలా హారిస్ నిలుపుకోగలిగితే అధ్యక్షురాలు కావడం సులభం. ట్రంప్ గెలవాలంటే ఈ 18 రాష్ర్టాల్లో కొన్నింటినైనా తన వైపు తిప్పుకోవాలి.
డిసెంబర్ 11నే ఫైనల్ రిజల్ట్!
భారత్‌లా అమెరికాలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ లాంటిది లేదు. ఆయా రాష్ర్టాలే ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తాయి. ఎన్నికల కౌంటింగ్ పూర్తి చేసి ప్రకటించేందుకు డిసెంబరు 11 వరకు సమయం ఉంటుంది. అధికారికంగా ఫలితాలు వెలువడేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ ముందుగా మీడియా సంస్థలు నాలుగైదు రోజుల్లో ఫలితాలను అంచనా వేయవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

