US Elections | హోరాహోరీ పోరు.. ట్రంప్, కమల హ్యారిస్‌కు సమాన ఓట్లు వస్తే ఎలా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. సర్వేలు కూడా ఈసారి విజేత ఎవరనేది అంచనా వేయలేకపోతున్నాయి.
US Elections | వాషింగ్టన్, నవంబర్ 5: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. సర్వేలు కూడా ఈసారి విజేత ఎవరనేది అంచనా వేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికల్లో కమల, ట్రంప్‌కు సమాన ఓట్లు వస్తే ఎలా అనే ప్రశ్న తలెత్తుతున్నది. అమెరికాలోని 50 రాష్ర్టాలకు కలిపి 538 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి.
ప్రజలు వేసే ఓట్లలో మెజారిటీ ఓట్లు దక్కించుకున్న అభ్యర్థి ఖాతాలోకి ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ ఓట్లన్నీ పడతాయి. ఇలా మొత్తంగా 270 ఓట్లు సాధించిన అభ్యర్థి విజేత అవుతారు. అయితే, ఇద్దరికీ 269-269 ఓట్లు వస్తే అనిశ్చితి నెలకొంటుంది. ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు.
అధ్యక్షుడిని ఎన్నుకోనున్న హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్
అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చిన, ఎవరికీ 270 ఓట్లు రాకపోతే అధ్యక్ష ఎన్నిక ఎలా జరగాలనేది అమెరికా రాజ్యాంగంలోని రెండో అధికరణంలో పొందుపరిచారు. ఈ పరిస్థితి తలెత్తితే అధ్యక్షుడిని కొత్తగా ఎన్నికైన సభ్యులతో కూడిన హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ) ఎన్నుకుంటుంది. ఒక్కో రాష్ట్ర ప్రతినిధి బృందానికి ఒక్కో ఓటు ఉంటుంది. ఈ ఓట్లు ఎక్కువగా పొందిన అభ్యర్థికి అధ్యక్ష పదవి దక్కుతుంది. అంటే, మొత్తం 50 రాష్ర్టాల్లో ఎక్కువ రాష్ర్టాలను గెలుచుకున్న అభ్యర్థి విజేత అవుతారు. ఇదే విధంగా ఉపాధ్యక్షుడిని సెనేట్ ఎన్నుకుంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

