సూర్యాపేట : రాష్ట్రంలో గోదావరి జలాలు అందక పోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలనా కాపాడుకునేందుకు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. తాజాగా సూర్యాపేట(Suryapet) జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం రామోజీ తండా వద్ద గోదావరి జలాలు రావడం లేదంటూ రైతులు రోడ్డుపై రాస్తారోకో(Farmers agitation) చేపట్టారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా గోదావరి జలాలు రాక పోవడంతో పొలాలు ఎండుతున్నాయని సోమవారం రైతులు అందోలనకు దిగారు. ఎస్సారెస్పీ 22 ఎల్ కెనాల్ వద్ద పరిసర గ్రామాల రైతులు చివేంల- ముకుందాపురం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఆరు సంవత్సరాలుగా గోదావరి జలాలతో ఈ ప్రాంతాల్లోని రైతుల పంటలు పండించుకుంటున్నారు. అయితే ఈ యాసంగి సీజన్లో నాట్లు వేశారు. పొలాలకు నీళ్లు ఇవ్వకపోవడంపై రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. వరి నాట్లు వేయకముందు వార బంది చొప్పున నీళ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, అధికారులు నీళ్లు నిలిపి వేయడంతో వరి పోలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే గోదావరి జలాలు కాలువ ద్వారా అందజేయాలన్నారు. లేదంటే అన్నిచోట్ల ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సుమారు 300 మంది రైతులు రోడ్డుపై రెండు గంటల సేపు ఆందోళన చేపట్టడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇవి కూడా చదవండి..
KTR | కటింగ్‌లు, కటాఫ్‌లు మినహా.. ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఒరిగిందేమిటి..? : కేటీఆర్
Cold Wave | తెలంగాణలో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. సింగిల్ డిజిట్‌కే పరిమితం
Banana Price | ఒక్క అరటి పండుకు ‘వంద’.. విదేశీయుడికి షాకిచ్చిన హైదరాబాదీ..! Video