జోగులాంబ గద్వాల : ప్రజల ప్రాణాలను కబలించే ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol factory) అనుమతులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం గేటు ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనాల మధ్య ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఫ్యాక్టరీ వ్యర్థాల వల్ల గాలి, నీరు కలుషితమవుతాయని, పంటలు పండక రైతులు వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటుందన్నారు.
పచ్చని పంటలు పండిస్తూ సంతోషంగా జీవిస్తున్న కుటుంబాల్లో ఫ్యాక్టరీతో అంధకారం అలుముకుంటుం దన్నారు. వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీని ఎత్తివేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. కాగా, రైతులు చేపట్టిన ఆందోళనకు మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు పలికారు. రైతుల తరఫున ఉద్యమిస్తామని హామీనిచ్చారు.
మద్దతు తెలుపుతున్న శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్