బిజినేపల్లి, జనవరి 5 : ప్రమాదవశాత్తు నీటి సంపులోపడి ఓ రైతు మృతి(Farmer dies) చెందిన విషాదకర సంఘటన నాగర్కర్నూల్(Nagarkurnool) జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వడ్డెమాన్కు చెందిన గుంటి బంగారయ్య(40) రోజు మాదిరిగానే తన మక్క పంటకు నీరు పారపెట్టేందుకు వెళ్లాడు. ఈక్రమంలో పొలంలో ఉన్న నీటి సంపులో కాలుజారిపడ్డాడు.
ఎవరూ గమనించకపోవడంతో సంపులోనే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు వెల్లడించారు. బంగారయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Madha Gaja Raja | 12 ఏండ్లకు థియేటర్లలోకి.. విశాల్ మదగజరాజ రిలీజ్ టైం ఫిక్స్
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్