ఆదిలాబాద్ : కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా సోయా పంట(Soy crop) కొనడం లేదని ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి(Farmer Attempts suicid) పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కుచులాపూర్‌కు చెందిన రైతు ఎడ్మల మోహన్ రెడ్డి దాదాపు 30 క్వింటాళ్ల సోయా పంటను నాలుగు రోజుల కిందట మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు.
బుధవారం కూడా కొనుగోలు చేపట్టకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా తాను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని, సోయా సంచులు చోరీకి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని ఏఎంసీ ఛైర్మన్ గంగారెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తనవెంట తెచ్చుకున్న పురుగు మందు డబ్బా తీసి తాగేందుకు ప్రయత్నించారు. సహచర రైతులు అప్రమత్తమై వెంటనే అడ్డుకున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఫార్ములా -ఈ రేస్ వల్ల జరిగే లాభం రేవంత్ రెడ్డికి తెలియదు.. మండిపడ్డ కేటీఆర్
KTR | ఫార్ములా-ఈ రేస్‌తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది : కేటీఆర్
KTR | కామన్వెల్త్ గేమ్స్ అనగానే కాంగ్రెస్ కుంభకోణం గుర్తుకొస్తది : కేటీఆర్