IND VS USA : టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే కష్టాల్లో పడింది. వాంఖడే స్టేడియంలో యూఎస్ఏ బౌలర్లు నమ్మశక్యం కాని విధంగా వికెట్లవేటతో రెచ్చిపోతున్నారు. కట్టుదిట్టంగా.. స్లో డెలివరీలతో దంచికొట్టేసే టీమిండియా స్టార్లను బోల్తా కొట్టించారు. వాన్ స్కాల్క్విక్(3-13) ఒకే ఓవర్లో మూడు వికెట్లతో పర్యాటక జట్టుకు అదిరే బ్రేకిచ్చాడు. ప్రస్తుతం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(15) రింకూ సింగ్ (3) క్రీజులో ఉన్నారు. మరో వికెట పడకుండా ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే పనిలో ఉన్నారిద్దరు. 10 ఓవర్లకు స్కోర్ 63-4
పొట్టి ప్రపంచకప్ తొలి పోరులో యూఎస్ఏ బౌలర్లను ఉతికేయాలనుకున్న భారత హిట్టర్లు అట్టర్ ఫ్లాప్అయ్యారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(0) ఎదుర్కొన్న మొదటి బంతికే గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్(20), తిలక్ వర్మ(25)లు పెద్ద షాట్లతో దూకుడుగా ఆడినా.. వాన్ స్కాల్క్విక్(3-13) ఊహించని దెబ్బకొట్టాడు.
8-1, 45-2, 45-3 👏
USA have three Indian wickets in the powerplay: https://t.co/tsTRL6Xvyi pic.twitter.com/jzRwBDjVRB
— ESPNcricinfo (@ESPNcricinfo) February 7, 2026
పవర్ ప్లే చివరి ఓవర్ రెండో బంతికే ఇషాన్‌ను బోల్తా కొట్టించిన అతడు.. ఆ తర్వాత తిలక్ వర్మను ఊరించే బంతితో పెవిలియన్ చేర్చాడు. సిక్సర్ల శివం దూబే (0) సైతం బంతిని ఆడాలా? వద్దా అనుకుంటూ ఆడి నేత్రవల్కర్ చేతికి చిక్కాడు. చూస్తుండగానే నాలుగు వికెట్లు పడడంతో స్టేడియమంతా నిశబ్దంగా మారింది.