Uttar Pradesh Tragedy | బస్సు దిగిన ప్రయాణికులు.. దూసుకెళ్లిన కంటైనర్, ఆరుగురు మృతి, 9 మందికి గాయాలు
Uttar Pradesh Tragedy | బస్సు ప్రయాణికులు మూత్ర విసర్జన కోసం కిందకు దిగారు. వేగంగా వచ్చిన కంటైనర్ ఆ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. అదుపుతప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు.
లక్నో: బస్సు ప్రయాణికులు మూత్ర విసర్జన కోసం కిందకు దిగారు. వేగంగా వచ్చిన కంటైనర్ ఆ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. అదుపుతప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు. (Uttar Pradesh Tragedy) ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న బస్సు మధుర ఎక్స్ప్రెస్వేపై రోడ్డుపక్కగా ఆగింది. కొందరు ప్రయాణికులు మూత్ర విసర్జన కోసం బస్సు నుంచి కిందకు దిగారు.
కాగా, వేగంగా వచ్చిన కంటైనర్ వెనుక నుంచి ఆ బస్సును ఢీకొట్టింది. అదుపుతప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరుగురి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు.
అయితే బస్సును గ్రీన్జోన్లో ఆపకపోవడం ఈ ప్రమాదానికి కారణమని పోలీస్ అధికారి తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యాన్ని తప్పుపట్టారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదం తర్వాత కంటైనర్ను వదిలి పారిపోయిన డ్రైవర్ కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.
Also Read:
SIR Row | ఆసుపత్రి మార్చురీలో భార్య, కుమారుడి మృతదేహాలు.. ‘సర్’ విచారణకు హాజరైన వ్యక్తి
defence officials bribe | లంచం తీసుకున్న రక్షణ శాఖ అధికారులు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సీబీఐ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

