Telangana Secretariat | హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో భద్రతా వైఫల్యం పూర్తిగా లోపించిందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఓ వ్యక్తి ఫేక్ ఐడీ కార్డులో సచివాలయంలోకి ప్రవేశించి, దందాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ నకలీ ఉద్యోగి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో.. సెక్రటేరియట్ సీఎస్‌వో దేవిదాస్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ సిబ్బంది నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు.
రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఫేక్ ఐడీ కార్డుతో ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ రావు చలామణి అవుతున్నారు. ఫేక్ ఐడీ సృష్టించి సచివాలయంలోకి ప్రవేశించిన అతని వద్ద ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు పూర్తి ఆధారాలు సేకరించి చాకచక్యంగా పట్టుకున్నారు. మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి. ప్రశాంత్ డ్రైవర్ రవి.. భాస్కర్ రావుకు ఫేక్ ఐడీ కార్డు తయారు చేసి ఇచ్చినట్లు ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ సిబ్బంది గుర్తించారు. దీంతో భాస్కర్ రావు, డ్రైవర్ రవిని కూడా సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇప్పటివరకు వారు ఏమేమి అక్రమాలు చేశారు..? ఎవరినైనా ఫేక్ ఐడీ చూపి ఆర్థికంగా మోసం చేశారా..? సెక్రటేరియట్లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉంది..? వీరికి ఎవరు సహకరించారు..? వీరి బాధితులు ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సెక్రటేరియట్లో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని, ఫైల్ క్లియర్ చేయిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ కేసులో ఏ1గా భాస్కర్ రావు, ఏ2గా డ్రైవర్ రవిని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Bomb Threat | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు.. నిందితుడు కామారెడ్డి వాసిగా గుర్తింపు
Siddipeta | సిద్దిపేటలో ఉపాధి హామీ పనుల్లో అపశృతి.. తల్లీకూతురు మృతి