Balka suman | మంత్రి వివేక్ వెంకటస్వామికి ఊడిగం చేస్తూ.. సిగ్గులేని, దద్దమ్మలలాగా పోలీసులు మా మీద కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలను బాల్క సుమన్ తీవ్రంగా ఖండించారు.
బుధవారం బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. చెన్నూరులో 18 వార్డులకుగాను కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 11 వార్డులు వస్తే మేము దాంట్లో వేలు పెట్టలేదు.. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం అని నేనే స్టేట్ మెంట్ ఇచ్చాను. మరి అదే క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకుగాను 14 వార్డుల్లో గెలిపించి ప్రజలు మాకు అవకాశమిస్తే , ఇక్కడి ప్రజా తీర్పును మీరెందుకు తుంగలో తొక్కుతున్నారని ప్రశ్నించారు. ఎందుకు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నరు. ఈ మంత్రి రాష్ట్ర ప్రజలు, చెన్నూర్ నియోజకవర్గం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
స్వయంగా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్ మా అభ్యర్థుల, కౌన్సిలర్ల బంధువులకు ఫోన్లు చేసి మీ ఇండ్లు కూల్చేస్తరు.. మీ ప్లాట్లు గుంజుకుంటరు. మీరు రామకృష్ణాపూర్లో తిరగలేరని బెదిరించే కార్యక్రమానికి తెరలేపారు. భద్రాచలం నుంచి మొదలుకొని.. ఇవాళ బాల్కసుమన్పై కేసు పెట్టి జైలుకు పంపించే కుట్రదాకా ప్రతీ సందర్భంలో ఏదో ఒక రకంగా ఈ క్యాతన్ పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనే పిచ్చి ఆలోచన తప్ప ఇంకోటి కాదన్నారు. వీళ్ల చేతుల్లో అధికారం ఉందని చెప్పి.. వీళ్ల చేతుల్లో పోలీసులున్నారని చెప్పి.. వీళ్లు చేస్తున్నదుర్మార్గాలను, దౌర్జన్యాలను అందరూ కూడా గమనించాలని రాష్ట్ర ప్రజలు, చెన్నూరు నియోవజకవర్గ ప్రజలను కోరుతున్నానన్నారు బాల్క సుమన్.
రాళ్లు కాంగ్రెస్ వాళ్లు విసిరితే, పోలీసులు మా మీద లాఠీచార్జ్ చేసి.. మళ్లీ కేసులు కూడా మా మీదే పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్ల దాడిలో మా కార్లు ధ్వంసం అయితే టీవీలో ఏమో మంత్రి వివేక్ కార్లు ధ్వంసం చేశారని చూపిస్తున్నారు. దాడి వాళ్లు చేస్తే కేసులు మా మీద పెడతారా? నిజంగా పోలీస్ వాళ్లకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే వీడియో ఫుటేజ్ చూడాలి కదా..? అని బాల్క సుమన్ సవాలు విసిరారు.
చెన్నూరులో 18 వార్డులకు మీకు 11 వార్డులు వస్తే మేము దాంట్లో వేలు పెట్టలేదు.. అదే క్యాతనపల్లిలో 22 వార్డులకు మాకు 14 వస్తే, మీరెందుకు ప్రజా తీర్పును హత్య చేస్తున్నారు
స్వయంగా కలెక్టర్ కుమార్ దీపక్, MRO మా అభ్యర్థులకు ఫోన్ చేసి మీ ఇండ్లు కూల్చేస్తానని బెదిరిస్తున్నారు – మాజీ… https://t.co/AosFbWWCKV pic.twitter.com/T47VOMiphp
— Telugu Scribe (@TeluguScribe) February 18, 2026
మాజీ ఎమ్మెల్యే సుమన్ పై, బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకుల రాళ్ల దాడి
రాళ్ళ దాడిలో బీఆర్ఎస్ నాయకుడి తలకి బలమైన గాయం
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఛైర్మెన్ ఎన్నికల్లో పాల్గొన నివ్వకుండా, అడ్డుకుంటున్న పోలీసులు, కాంగ్రెస్ నాయకులు
క్యాతనపల్లి… https://t.co/M0bsxVAbVt pic.twitter.com/cXu9R8wj9J
— Telugu Scribe (@TeluguScribe) February 17, 2026
చెన్నూరులో 18 వార్డులకు మీకు 11 వార్డులు వస్తే మేము దాంట్లో వేలు పెట్టలేదు.. అదే క్యాతనపల్లిలో 22 వార్డులకు మాకు 14 వస్తే, మీరెందుకు ప్రజా తీర్పును హత్య చేస్తున్నారు
స్వయంగా కలెక్టర్ కుమార్ దీపక్, MRO మా అభ్యర్థులకు ఫోన్ చేసి మీ ఇండ్లు కూల్చేస్తానని బెదిరిస్తున్నారు – మాజీ… https://t.co/AosFbWWCKV pic.twitter.com/T47VOMiphp
— Telugu Scribe (@TeluguScribe) February 18, 2026