ములుగు : ములుగు( Mulugu) జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పక్కన ఉన్న గొల్లగుడిలో(Golla Gudi) గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల (Hidden Treasures) తవ్వకాలు చేపట్టారు. గుడి పై కప్పును ధ్వంసం చేయడంతో పాటు గుడి లోపల తవ్వకాలు చేపట్టి కొన్ని శిల్పాలను కూడా ధ్వంసం చేశారు. గుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఉపయో గించిన నిచ్చెనతోపాటు పలు వస్తువులు లభ్యమ య్యాయి. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న పురావస్తు శాఖ అధికారులు ఆదివారం వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.