Netflix | నెట్‌ఫ్లిక్స్‌పై వీసా ఉల్లంఘన.. పన్ను ఎగవేత.. వివక్ష ఆరోపణలు.. దర్యాప్తు చేపట్టిన హోంశాఖ..?!
Netflix | ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వీసా ఉల్లంఘన, పన్ను ఎగవేతకు పాల్పడటంతోపాటు జాతి వివక్ష ప్రదర్శిస్తుందన్న ఆరోపణపై కేంద్ర హోంశాఖ దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తున్నది.
Netflix | నెట్‌ఫ్లిక్స్.. ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో పాపులర్ సంస్థ ఇది. అమెరికాకు చెందిన ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ అనుబంధ నెట్ ఫ్లిక్స్ ఇండియా సంస్థ నియంత్రణ నిబంధనలు, చట్టాలను ఉల్లంఘిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి వీసా నిబంధనల ఉల్లంఘన, జాతి వివక్ష వంటి చర్యలకు పాల్పడుతున్నదని వచ్చిన ఆరోపణలపై కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దేశీయంగా నెట్ ఫ్లిక్స్ వ్యాపార పద్దతులపైనా దర్యాప్తు చేస్తున్నట్లు ఆ సంస్థ మాజీ ఉద్యోగికి పంపిన ఈ మెయిల్ లో కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పినట్లు సమాచారం.
2020లోనే నెట్ ఫ్లిక్స్ ఇండియా బిజినెస్ అండ్ లీగల్ అఫైర్స్ డైరెక్టర్‌గా తప్పుకున్న నందినీ మెహతాకు కేంద్ర హోంశాఖ అధికారి రాసిన లేఖతో నెట్ ఫ్లిక్స్ భారత్ ఆపరేషన్స్ మీద దర్యాప్తు చేస్తున్నట్లు అర్థమైంది. ఈ మేరకు గత జూలై 20న నందినీ మెహతాకు కేంద్ర హోంశాఖ అధికారి పంపిన మెయిల్ కూడా బయటకు వచ్చింది. వీసా నిబంధనల తోపాటు పన్ను నిబంధనలనూ నెట్ ఫ్లిక్స్ ఉల్లంఘిస్తోందని హోంశాఖ ఆధీనంలోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారి దీపక్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘భారత్‌లో వ్యాపార నిర్వహణలో కంపెనీ ప్రవర్తనా నియమావళి, వీసా నిబంధనల ఉల్లంఘన, చట్ట విరుద్ధ నిర్మాణాలు, పన్ను ఎగవేత, జాతి వివక్ష వంటి చర్యలకు నెట్ ఫ్లిక్స్ పాల్పడుతున్నట్లు మాకు సమాచారం వచ్చింది. దీనిపై విచారణ చేపట్టాం’ అని దీపక్ యాదవ్ తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ నిర్ణయాన్ని నందినీ మెహతా స్వాగతించారు. దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయాలని కోరారు. తన పట్ల జాతి, లింగ వివక్షకు పాల్పడుతూ తప్పుగా తనను తొలగించారని నందినీ మెహతా ఆరోపించారు. ఈ విషయమై నెట్ ఫ్లిక్స్ యాజమాన్యంపై కేసు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే, నందినీ మెహతా ఆరోపణలను నెట్ ఫ్లిక్స్ నిరాకరించింది.
ఇక నందినీ మెహతాకు లేఖ రాసిన సంగతిపై స్పందించేందుకు దీపక్ యాదవ్ నిరాకరించారు. తనకు దీనిపై స్పందించే అధికారం లేదన్నారు. తమపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టిన విషయమై సమాచారం లేదని నెట్ ఫ్లిక్స్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

