Congress Party | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పారు. గతేడాది మార్చి 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కోనేరు కోనప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానని, మరే పార్టీలో చేరనని స్పష్టం చేశారు. ఇక నుంచి స్వతంత్రంగా ఉంటానని తెలిపారు కోనేరు కోనప్ప. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా కోనేరు కోనప్ప ప్రచారం నిర్వహించారు.
2004లో మొదటిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు కోనేరు కోనప్ప. 2014లో బీఎస్పీ తరపున గెలిచిన ఆయన.. నాటి అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మళ్లీ గెలుపొందారు. కానీ 2023 ఎన్నికల్లో కోనప్ప ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. తాజాగా సిర్పూర్లో కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న విబేధాల కారణంగానే కోనేరు కోనప్ప పార్టీని వీడుతున్నట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి..
Gandhi Bhavan | రుణమాఫీ కాలేదంటూ.. గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా.. వీడియో
Mysterious disease | కొన్నూర్‌లో అంతుచిక్కని వ్యాధి.. మూడు రోజుల్లో 2500 కోళ్లు మృతి
Bhupalpally | రైతులపై ఫారెస్ట్ అధికారుల దాష్టీకం.. బూటు కాళ్లతో తన్నుతూ విచక్షణారహితంగా దాడి