Srinivas Goud | హైదరాబాద్ : తిరుమలలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరం, బాధాకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తొక్కిసలాటలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, టీటీడీ బోర్డుకు విజ్ఞప్తి.. ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలి. లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. తిరుమల బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సందర్భాల్లో అత్యధిక భక్తులు తెలంగాణ, తమిళనాడు నుంచి భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాలతో మాట్లాడి అదనపు సిబ్బందిని సమకూర్చుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. గాయపడిన వారికి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు పంపించాలని కోరుతున్నాం అని శ్రీనివాస్ గౌడ్ సూచించారు.
హైదరాబాద్‌లో టీటీడీ కార్యాలయం ఉంది. ఇక్కడ బుకింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఇలాంటి పరిస్థితి తలెత్తదు. టోకెన్లు దొరక్కపోయినా చాలా మంది వెళ్లడంతో తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో టోకెన్లు ఇవ్వాలి. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించాలన్న ప్రతిపాదనను టీటీడీ బోర్డు స్వీకరించినందుకు సంతోషం. తమ వ్యాఖ్యలపై రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ మేం అడిగిన దాంట్లో ధర్మం ఉందని న్యాయం చేశారు. తెలంగాణలో చాలా వరకు ప్రతి ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి.. దర్శనాల టోకెన్ల కోసం తెలంగాణలో కూడా కౌంటర్లు ఏర్పాటు చేయండి. తెలంగాణ భక్తులు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | లాయర్ రామచంద్రరావుతో కలిసి.. ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్
KTR | నేను కేసీఆర్ సైనికుడిని.. నిఖార్సయిన తెలంగాణ బిడ్డను: కేటీఆర్
KTR | తెలంగాణ, హైదరాబాద్ ఇమేజ్ను పెంచేందుకే.. ఫార్ములా-ఈ రేస్‌ను తీసుకొచ్చాం: కేటీఆర్