Koppula Eshwar | జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం నిరసన దీక్షలో పాల్గొనడం బాధాకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని 8వ రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా బాధ్యతలు నిర్వహిస్తుందన్నారు. అనేక విషయాలపై అవగాహన కలిగి సమాజాన్ని మేల్కొలిపే స్థానంలో జర్నలిస్టులు ఉన్నారన్నారు. వారికి ఉండే అనేక ఇబ్బందులను, ఆర్థిక పరిస్థితులను అధిగమించి జర్నలిస్టులుగా కొనసాగుతున్నారన్నారు.
వారికి ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి తాను మంత్రిగా ఉన్న సమయంలో ధరూర్ క్యాంప్‌లో ప్రతి జర్నలిస్టుకి రెండు గంటల స్థలాన్ని కేటాయించాలని భావించి గతంలో ప్రతిపాదనలు పెట్టామన్నారు. కలెక్టర్‌తో మాట్లాడామని.. కేటీఆర్ సైతం కలెక్టర్‌తో మాట్లాడారని తెలిపారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే పెద్ద అడ్డం కాదన్నారు. వారు ఎవరికీ శత్రవులు కాదన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుగా లేదని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెద్దగా ఉండకపోవచ్చన్నారు. కలెక్టర్ ఈ విషయంలో దృష్టి సారించి ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, హరి చరణ్ రావ్, లోక బాపురెడ్డి, గోస్కుల జలేందర్, గాదె మాధవరావు సైతం దీక్షకు మద్దతు తెలిపారు.
MLA Sanjay | గురుకుల విద్యార్థుల మరణాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే : ఎమ్మెల్యే సంజయ్