MLA Sanjay | గురుకుల విద్యార్థుల మరణాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే : ఎమ్మెల్యే సంజయ్
MLA Sanjay | గత ఏడు నెలల్లో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో 36 మంది విద్యార్థులు చనిపోయారని, దాదాపు 500 మంది విద్యార్థులు ఈ ఏడు నెలల్లో ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఈ విద్యార్థుల మరణాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే అని ఎమ్మెల్యే చెప్పారు
MLA Sanjay | హైదరాబాద్ : గత ఏడు నెలల్లో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో 36 మంది విద్యార్థులు చనిపోయారని, దాదాపు 500 మంది విద్యార్థులు ఈ ఏడు నెలల్లో ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఈ విద్యార్థుల మరణాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే అని ఎమ్మెల్యే చెప్పారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సంజయ్ మీడియాతో మాట్లాడారు.
ఇంతకు ముందు మంచాన పడ్డ మన్యం అని వార్తలు చూసేవాళ్లం. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఆ న్యూస్ కనబడకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచాన పడ్డ గురుకుల విద్యార్థులు అని రోజు వార్తలు వస్తున్నాయి. విద్యార్థుల మరణాలపై మంత్రులు, అధికారుల నుంచి స్పందన లేదు. తన సొంత నియోజకవర్గంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారని, వారిలో ఇద్దరు మరణించారని తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి విచారణ కూడా జరగలేదు. రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే.. ఇది ప్రభుత్వ హత్య. బాధ్యతగల లీడర్‌గా నేను ఈ మాటలు మాట్లాడను. కానీ రేవంత్ ప్రతిపక్షంలో ఉంటే ఈ విధంగానే మాట్లాడేవారు అని సంజయ్ పేర్కొన్నారు.
గురుకుల హాస్టళ్లలో నెలకొన్న పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో 1,200 గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గురుకులాల పనితీరును అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, జాగ్రత్తలు తీసుకున్నారని గుర్తు చేశారు. కానీ నేడు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నాసిరకమైన భోజనాన్ని పిల్లలకు అందించడంతో.. వారు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. హాస్టళ్లలో పాములు, ఎలుకలు ఉండడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. గురుకుల విద్యావ్యవస్థను రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
TGSRTC | మహిళలకు శుభవార్త.. ఆర్టీసీ కార్గోలో రాఖీలు.. 24 గంటల్లో చేరేలా చర్యలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

