Jagadish Reddy | భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ శేరి షుభా, గట్టు రాచందర్రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిన్న రోజంతా మొద్దునిద్ర పోయిందని.. గంటల తరబడి బాధితులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూశారన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేన్నారు. సీఎం నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేశారని నిలదీశారు. ప్రజలే రెస్క్యూ ఆపరేషన్ చేసుకుని ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు.
హెలికాప్టర్ కోసం ప్రయత్నం చేసినా రాలేదని ఓ మంత్రి చెబుతున్నారని.. మంత్రిగా ఫెయిల్యూర్ అయ్యారని.. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హెలికాప్టర్ మాట్లాడకుండా సీఎం చేశారని.. ఖమ్మంలో సహాయం కోసం ప్రజలు 9 గంటలు వేచిచూసినా సహాయం అందలేదన్నారు. ఓ మంత్రి హెలికాప్టర్ కోసం ఏపీ సీఎంతో మాట్లాడానని అన్నారని.. తెలంగాణ సీఎంతో ఎందుకు మాట్లాడలేదన్నారు. వర్షాలపై సీఎస్ హెచ్చరికను ఫాలో అయ్యి సీఎం, మంత్రులు బయటకు రాకుండా ఉన్నారా? అంటూ నిలదీశారు. పరిపాలన మాకు చేతకావడం లేదని మంత్రులు అంటున్నారని.. ప్రభుత్వానికి పరిపాలించే నైతిక హక్కు లేదన్నారు. సీఎంతో అమిత్ షా, మోదీ మాట్లాడితే తెలంగాణకు హెలికాప్టర్ కావాలని ఎందుకు అడగలేదని నిలదీశారు. ప్రభుత్వం వైపు నుంచి హెచ్చరికలు ఉంటే ప్రజలు బయటకురారని.. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారన్నారు. మంత్రులు ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్ దొరుకుతుందని.. కానీ ప్రజలను తరలించేందుకు హెలికాప్టర్ దొరకలేదా? అంటూ ధ్వజమెత్తారు.
వర్షాలతో సంభవించిన మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని.. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25లక్షలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని.. ప్రభుత్వం ప్రజల మధ్యన ఉండాలన్నారు. నిన్న జరిగిన సంఘటనలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సోయితో పని చేయాలని.. వరదలపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల్లో ఒక్క రాజకీయ పదం కనిపించిందా..? అంటూ ధ్వజమెత్తారు. ఖమ్మంలో ప్రజలు గజఈతగాళ్లకు డబ్బులు ఇచ్చి ప్రాణాలు రక్షించుకున్నారని.. కోదాడలో ఎవరి హయాంలో కబ్జాలు జరిగాయో ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చకు సిద్ధమన్నారు.
SCR | మహబూబాద్‌లో మొదలైన రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు.. పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం
Heavy rains | రెయిన్ ఎఫెక్ట్.. మహారాష్ట్ర- తెలంగాణకు రాకపోకలు నిలిపివేత