SCR | భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇంటికన్నె, తాళ్లపూసల మార్గంలో రైల్వేట్రాక్ ధ్వంసమైన విషయం తెలిసిందే. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను మళ్లించిన విషయం తెలిసిందే. తాజాగా వరదలతో దెబ్బతిన్న రైల్వేట్రాక్ మరమ్మతు పనులను రైల్వేశాఖ అధికారులు ప్రారంభించారు. ధ్వంసమైన రైల్వేట్రాక్‌కు శరవేగంగా సిబ్బంది మరమ్మతు పనులు చేశారు. రైల్వేట్రాక్ మరమ్మతుల పనులకు వరద ప్రవాహం ఆటంకంగా మారింది. ఎక్స్కవేటర్లు మోహరించి వరద నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరమ్మతు పనుల్లో దాదాపు 500 మంది రైల్వే సిబ్బంది, కార్మికులను మోహరించారు. రాత్రి వరకు పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నది. ప్రస్తుతం మరమ్మతు పనులను 15 మంది సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరో వైపు మరమ్మతు పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ పరిశీలించారు. మంగళవారం ఉదయం కల్లా రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా.. కాజీపేటలో వేచి ఉన్న ప్రయాణికులకు రైల్వే సిబ్బంది ఆహారం అందించారు.
#WATCH | Mahabubabad, Telangana: A railway track near Intakanne railway station connecting Kesamudram and Intakanne washed away yesterday due to the heavy rains. The restoration works are ongoing at the location. pic.twitter.com/qCfpG3OUzf
— ANI (@ANI) September 2, 2024