Harish Rao | సిద్దిపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే మరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. సన్నవడ్లు అమ్ముకొని రెండు నెలలైనా రైతులకు బోనస్ డబ్బులు ఇవ్వడం లేదు అని హరీశ్‌రావు మండిపడ్డారు. అన్ని పంటలకు బోనస్ అన్న మాటలను బోగస్ చేసింది రేవంత్ సర్కార్ అని తీవ్రంగా విమర్శించారు.
వరంగల్ రైతు డిక్లరేషన్ తుంగులో తొక్కారు. రుణమాఫీ, రైతు భరోసా, వడ్ల పైసలు కూడా ఇవ్వలేదు రెండో పంట ఎలా వేస్తారు..? రాష్ట్రంలో ఇంకా రూ. 432 కోట్ల బోనస్ బకాయిలు ఉన్నవి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తర కుమార ప్రగల్బాలు అయినవి. చేతకాని మాటలు ఎందుకు మాట్లాడతావు. పొద్దున లేస్తే బీఆర్ఎస్పైన ఎందుకు మాట్లాడతావ్. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పాలాభిషేకం చేయాలి అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
రైతు కందులు పండిస్తే మూడు క్వింటాల్లే కొంటున్నారు. కంది రైతుల మీద ఎందుకు పగ మీకు. క్రాప్ బుకింగ్‌లో మిస్సింగ్ అయిన రైతులకు అనుమతి ఇవ్వండి. రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుని డిమాండ్ చేస్తున్న.. రైతు పండించిన మొత్తం కందులను కొనుగోలు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలి. విదేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకోవడం వలన విదేశీ మారక ద్రవ్యం తరిగిపోతుంది. పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలే. కాంగ్రెస్ కోతల ప్రభుత్వం అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఓ రైతుకు 31 గంటలకు భూమి ఉంటే రూ. 1650 మాత్రమే రైతు బంధు పడతాయా..? సీఎం రూ. 250 కోట్ల చెక్కు ఎందుకు పడడం లేదు.. ఉత్తుత్తి చెక్కు ఇచ్చినవా..? కొత్త పాస్ బుక్ వచ్చిన వాళ్లకు రైతుబంధు పడడం లేదు. ప్రభుత్వం మోసం చేసింది అని గ్రామాలలో మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ తవ్వుకున్న గ్యారంటీల సమాధిలో సమాధి అవుతుంది. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీని గాలిలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీది జగమంతా పాలన, కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన. మాది అసలు పాలన మీది కొసరు పాలన. సంతృప్తి, సంక్షేమం బీఆర్ఎస్ పాలన.. సంక్షోభం, అసంతృప్తి అసహనం కాంగ్రెస్ విధానం అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Son Murder | ఇంటికి ఆలస్యంగా వచ్చాడని.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి..
KTR | అన్ని ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించిన పార్టీ బీఆర్ఎస్సే : కేటీఆర్