KTR | హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలుకుంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల వరకు బీసీలకు 50 శాతానికి మించి సీట్లు కేటాయించిన పార్టీ కేవలం బీఆర్ఎస్సే అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బీసీ నేతలతో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
బీసీలకు రిజర్వేషన్లు మీ పార్టీ ఇచ్చేది ఏంది..? బీఆర్ఎస్ పార్టీ 50 శాతానికి మించి బలహీన వర్గాలకు టికెట్లు కేటాయించింది. స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలతో పాటు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీలకు కేటాయించారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది.. 34 సీట్లు ఇస్తామని చెప్పి.. 19 ఇచ్చారు.. ఇందులో ఓల్డ్ సిటీలోనే ఐదు ఉన్నాయి. మేం 34 సీట్లు ఇచ్చి చిత్తశుద్ధి చాటుకున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
బీసీల ఆవేదనను అర్థం చేసుకున్న పార్టీగా మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా.. ప్రెస్మీట్లు, సమావేశాలు నిర్వహించి ప్రజలను జాగృతం చేస్తాం. ప్రభుత్వం మొండి వైఖరితో బీసీల గొంతుకోసి ఎన్నికలకు పోతే ఏం చేయాలో నిర్ణయించాం.. కేసీఆర్‌కు ఇవాళ్టి నిర్ణయాలను నివేదించి తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తాం. ఇక బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టం. బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ఎండగడుతాం అని కేటీఆర్ హెచ్చరించారు.
రాజ్యాంగ సవరణ అని మాట్లాడుతున్నారు.. మోదీ రాహుల్ కూర్చుంటే చాయ్ తాగే లోపు అయిపోతది రాజ్యాంగ సవరణ. ముల్కీ రూల్స్‌ను ఆనాడు సుప్రీంకోర్టు అప్‌హెల్డ్(కరెక్ట్) చేస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ నాయకత్వంలో ముల్కీ రూల్స్‌ను రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయలేదా..? మరి ఇవాళ బీసీలకు న్యాయం చేసే విషయంలో రాజ్యాంగ సవరణ చేయడానికి మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది అని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
KTR | కులగణన తప్పులతడక, అశాస్త్రీయం.. రీసర్వే చేయాలని కేటీఆర్ డిమాండ్
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని రచ్చబండపై నిరాహారదీక్షకు దిగిన యువకుడు