Harish Rao | సిద్దిపేట : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట పట్టణ కేంద్రంలో శ్రీ కృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ సభ్యులకు ఎమ్మెల్యే హరీష్ రావు గుర్తింపు కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ హాల్‌కు వచ్చే డబ్బులను పేద విద్యార్థుల చదువులకు ఖర్చు చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు యాదవుల గొప్పతనం అసెంబ్లీలో చెప్పారు. యాదవులకు ఎన్నో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ నాయకులు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. గొర్రె పిల్లలు ఇవ్వకుండా డీడీలు కూడా వాపస్ ఇచ్చారని హరీశ్‌రావు మండిపడ్డారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి. దొంగ సర్వే చేసి, బీసీ జనాభాను తగ్గించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం సీట్లు ఇవ్వాలి. ఏ ఒక్క కులానికి న్యాయం చేయలేదు.. 42 శాతం రిజర్వేషన్ తెచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలి. ఓట్లు మాత్రం అందరివి కావాలి.. బీసీలకు మాత్రం అన్యాయం చేయాలన్నట్టు కాంగ్రెస్ నీతి ఉంది. బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. ఢిల్లీలో కేంద్ర బడ్జెట్లో గుండు సున్నా ఇచ్చారని హరీశ్‌రావు విమర్శించారు.
రేవంత్ రెడ్డి తెలంగాణలో దోచుకొని ఢిల్లీకి పంపుతున్నడు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డికి దొరకడం లేదు. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టారు.. రేవంత్ రెడ్డి తెలంగాణ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూమాత.. భూమేత అయింది. భూముల వ్యవహారానికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య గొడవలు జరుగుతున్నాయని హరీశ్‌రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | అన్ని ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించిన పార్టీ బీఆర్ఎస్సే : కేటీఆర్
KTR | కులగణన తప్పులతడక, అశాస్త్రీయం.. రీసర్వే చేయాలని కేటీఆర్ డిమాండ్