Son Murder | యాదాద్రి భువనగిరి : కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కాలయముడయ్యాడు. ఇంటికి ఆలస్యంగా వచ్చాడని కుమారుడిని తండ్రి కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన చౌటుప్పల్ మండలం ఆరేగూడెం గ్రామంలో నిన్న రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆరేగూడెం గ్రామానికి చెందిన ఓ విద్యార్థి(14).. చౌటుప్పల్లోని ఓ ప్రయివేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. నిన్న స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమంలో సదరు విద్యార్థి పాల్గొన్నాడు. ప్రోగ్రామ్ ఆలస్యం కావడంతో.. ఇంటికి వచ్చేసరికి రాత్రి అయింది. దీంతో ఆగ్రహావేశాలతో ఊగిపోయిన తండ్రి.. కుమారుడి ఊపిరి తీశాడు. కోపంతో కుమారుడిని కొట్టి చంపాడు.
అయితే పోస్టుమార్టం నిర్వహించకుండా.. ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆరేగూడెం గ్రామానికి చేరుకుని భాను మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రి సైదులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | అన్ని ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించిన పార్టీ బీఆర్ఎస్సే : కేటీఆర్
KTR | కులగణన తప్పులతడక, అశాస్త్రీయం.. రీసర్వే చేయాలని కేటీఆర్ డిమాండ్