Harish Rao | ఖమ్మం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యంగ్యం ఎక్కువ, పనితనం తక్కువ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఖమ్మంలో 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 9 మంది ప్రాణాలు కూడా కాపాడలేకపోయారు. వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు.
ఎక్కడా చూడు వ్యంగమే.. పాలనపై రేవంత్ రెడ్డి పట్టు కోల్పోయారు. చీటిమాటికి ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారు. ఇంకా మొద్దు నిద్ర నుంచి మేల్కొనలేదు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వర్షాలు పడబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం ముందుస్తు చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగింది. దాదాపు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల వరకు నష్టం జరిగింది. కట్టుబట్టలతో బయటపడ్డామని వరద బాధితులు ఆవేదన చెందుతున్నారు. సర్టిఫికెట్లు, బియ్యం, నిత్యావసర వస్తువులు తడిసిపోయాయని కన్నీరుమున్నీరు అవుతున్నారు. కష్టపడి సంపాదించుకున్న బంగారం కొట్టుకుపోయిందంటున్నారు. 12 గంటల పాటు తాగడానికి నీళ్లు లేక విలవిలలాడిపోయారట. రెండు రోజుల నుంచి తినడానికి తిండి లేదని బాధపడుతున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని హరీశ్‌రావు మండిపడ్డారు.
చనిపోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇవ్వాలని ఇదే రేవంత్, సీతక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగారు. ఆ మాట ప్రకారం తక్షణమే చనిపోయిన కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వండి. మాట మీద నిలబడాలని డిమాండ్ చేస్తున్నాం. వరదలో పూర్తిగా మునిగిన ఇండ్లకు తక్షణమే రూ. 2 లక్షలు సాయం చేయాలని కోరుతున్నాం. మీరు ఇచ్చే రూ. పది వేలు ఏ మూలకు సరిపోవు.. దయచేసి ఆదుకోండి.. పిల్లల సర్టిఫికెట్లు తడిసి ముద్దయ్యాయి.. వారందరికి ఉచితంగా సర్టిఫికెట్లు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం. బియ్యం ఇచ్చినా వండుకొనే పరిస్థితి లేదన్నారు. ఇంట్లో బురద ఉన్నాక ఎలా వండుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివాళాకోరు ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డికి వ్యంగం ఎక్కువ.. మోకాలికి, బోడిగుండుకు లింక్ పెట్టి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
వరద సహాయక చర్యల్లో కేంద్రం కూడా విఫలమైంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, హెలికాప్టర్లను పంపలేకపోయింది. ప్రజల ప్రాణాలను కాపాడడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. సీఎంను డిమాండ్ చేస్తున్నాం.. అఖిలపక్షాన్ని ఢిల్లీకీ తీసుకెళ్లాలి. మోదీని నిలదీద్దాం.. సహాయం ఎందుకు చేయరో అడుగుదాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల ప్రజలు బలయ్యారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ : హరీశ్‌రావు
KTR | ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై దాడి చేయడం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనం : కేటీఆర్
Jagadish Reddy | దాడులకు భయపడుతామనుకుంటే అది మీ భ్రమ, ప్రజల తరఫున పోరాడుతాం : జగదీశ్వర్ రెడ్డి