KTR | ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై దాడి చేయడం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనం : కేటీఆర్
KTR | ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాలు దాడికి పాల్పడడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR | ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాలు దాడికి పాల్పడడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయడం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమన్నారు. ప్రజలకు సాయం చేతగాక సాయం చేస్తున్న వారిని చూసి ఓర్వలేక దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజలను నిర్లక్ష్యం చేస్తే.. బాధితులకు అండగా నిలబడడం తప్పా అంటూ ప్రశ్నించారు.
ప్రజలకు సేవ చేయడం చేతకాదని.. సేవ చేసేవారిపై మాత్రం దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ఎన్ని చేసినా సరే ప్రజల వద్దకు బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరన్నారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారని.. సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

