Harish Rao | ఖమ్మం : ఈ రోజు ఉదయం ఖమ్మం మార్కెట్ యార్డులో వెళ్ళినప్పుడు రైతులందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బాధపడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. మళ్లీ కేసీఆర్ సార్ ప్రభుత్వమే రావాలి అని ఖమ్మం రైతులు చెప్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
మార్పు మార్పు అని ఊదరగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏం మార్పు వచ్చింది? రైతుబంధు, బతుకమ్మ చీరలు, గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్, దళిత బంధు, గొర్రె పిల్లల పంపిణీ, బీసీ బంధు.. ఇలా అన్నీ బంద్ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి హామీ మహిళలకు రూ. 2500 ఇస్తామని గ్యారెంటీ ఇచ్చారు. భట్టి విక్రమార్క ఇంటింటికి బాండ్ పేపర్ మీద రాసి హామీ ఇచ్చాడు. ఒక్కొక్క మహిళకు రూ. 27500 కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడింది ఈ 11 నెలల్లో. మహిళల ఓట్లు దండుకొని మోసం చేశారు. కల్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అని మోసం చేశారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
కేసీఆర్ ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా అమలు చేశారు. కళ్యాణ లక్ష్మి ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా అమలు చేసి చూపించాడు కేసీఆర్. లక్ష రూపాయలు ఆడబిడ్డ పెళ్లికి అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. గత 11 నెలల్లో తెలంగాణలో 6 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ ఆరు లక్షల తులాల బంగారం బాకీ పడింది. బస్సు తప్ప అంత తుస్సే. బస్సు సర్వీసులు తగ్గించి ఆడబిడ్డలను ఇబ్బంది పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని హరీశ్‌రావు మండిపడ్డారు.
రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని దేవుని మీద ఒట్టు పెట్టి మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ఏ ముఖ్యమంత్రి అయినా దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పుతారా? పాలకులు పాపం చేస్తే ప్రజలకు నష్టం జరుగుతుందని అయ్యగారు చెప్తే నేను దేవాలయాలకు వెళ్ళాను. రేవంత్ రెడ్డి పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తానని ఒట్టు పెట్టి మోసం చేశాడని పాపపరిహారం చేశాను.
అయితే తిట్లు లేదంటే దేవుని మీద ఓట్లు అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
ఇవి కూడా చదవండి..
KTR | అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలి.. రేవంత్ సర్కార్‌కు కేటీఆర్ డిమాండ్
Harish Rao | కొనుగోలు కేంద్రాల్లేక ధాన్యం దళారుల పాలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్