Harish Rao | హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో వంటవాళ్లకు బదులుగా విద్యార్థులను వంటపనికి వినియోగించడంతో ఓ విద్యార్థి ఒంటిపై వేడి నూనె పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు.
తెలంగాణ గురుకులాల్లో జరుగుతున్న దారుణాలకు ఇది మరో నిదర్శనం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. 1971లో ముఖ్యమంత్రి హోదాలో దివంగత పీవీ నరసింహారావు దేశంలో మొదటి గురుకులాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేల్లో ప్రారంభించారు. నేడు అదే గురుకులంలో విద్యార్థినితో వంట చేయిస్తే, వేడి రాగి జావ పడి ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన పరిస్థితి నెలకొంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఒకవైపు అసెంబ్లీలో గురుకులాలపై చర్చ, మరోవైపు అదే సమయంలో ఈ దారుణం. గురుకులాల్లో దారుణమైన పరిస్థితుల గురించి ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కడమే తప్ప, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఇప్పటికైనా కళ్లు తెరవండి. మీ పాలనలో రోజురోజుకి దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని కాపాడండి. గాయపడ్డ విద్యార్థినికి మంచి వైద్యం అందించండి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీశ్‌రావు సూచించారు.
తెలంగాణ గురుకులాల్లో జరుగుతున్న దారుణాలకు ఇది మరో నిదర్శనం.
1971లో ముఖ్యమంత్రి హోదాలో దివంగత పీవీ నరసింహారావు గారు దేశంలో మొదటి గురుకులన్ని యాదాద్రి భువనగిరి జిల్లా, సర్వేల్ లో ప్రారంబించారు.
నేడు అదే గురుకులంలో విద్యార్థినితో వంట చేయిస్తే, వేడి రాగి జావ పడి ఆ విద్యార్థి… pic.twitter.com/6acm94mF2T
— Harish Rao Thanneeru (@BRSHarish) December 18, 2024
ఇవి కూడా చదవండి..
KTR | దమ్ముంటే ఫార్ములా – ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టండి : కేటీఆర్
Student injured | సర్వేల్ గురుకుల పాఠశాలలో దారుణం.. ప్రిన్సిపాల్ వైఖరితో విద్యార్థికి తీవ్ర గాయాలు