Student injured : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా నారాయణపురం (Narayanapuram) మండలంలోని సర్వేల్ (Survale) గురుకుల పాఠశాల (Gurukul school) లో దారుణం చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ వంటవాళ్లకు బదులుగా విద్యార్థులను వంటపనికి వినియోగించడంతో ఓ విద్యార్థి ఒంటిపై వేడి నూనె పడింది. ఈ ఘటనలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
సర్వేల్ గురుకుల పాఠశాలలో వంట మనుషులు సరిపడా లేకపోవడంతో విద్యార్థులను వంటపనికి వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో 8వ తరగతి విద్యార్థి వంట చేస్తూ వేడి నూను మీద పడేసుకున్నాడు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రిన్సిపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
8వ తరగతి విద్యార్థితో వంట చేయించిన ప్రిన్సిపాల్.. నూనె పడి విద్యార్థికి గాయాలు
భువనగిరి – నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో వంట మనుషులు లేకపోవడంతో 8వ తరగతి విద్యార్థితో వంట పనులు చేయించిన ప్రిన్సిపాల్.
అయితే వంట చేస్తుండగా విద్యార్థి ఒంటిపై నూనె పడి తీవ్ర గాయలు.… pic.twitter.com/B4RG20grZm
— Telugu Scribe (@TeluguScribe) December 18, 2024