Harish Rao | హైదరాబాద్ : తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్లు అమ్మకాలు నిలిపి వేస్తున్నట్టు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు.
తెలంగాణకు కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ తీసుకున్న నిర్ణయం అనేక ప్రశ్నలకు తావిస్తోందని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ బకాయిలు చెల్లించలేదని యూబీఎల్ పేర్కొంది. బీర్ల విక్రయాలు నిలిపివేస్తే ప్రీమియం బ్రాండ్లు కింగ్ ఫిషర్, హీనెకెన్కు అంతరాయం కలుగుతుంది. స్థానిక బ్రాండ్లు బూమ్ బూబ్ బీర్, బిర్యానీ బీర్ల ప్రోత్సాహానికి చేస్తున్న ప్రయత్నమా..? బిల్లుల చెల్లింపులో ప్రత్యేక ప్రాధాన్యతల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం సీనియారిటీ ఆధారంగా బిల్లులను క్లియర్ చేసేది అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ధరల విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోక పోవడం వల్ల తెలంగాణలో కంపెనీ నిర్వహణ నష్టాలు పెరిగాయని.. అందువల్ల, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కి సరఫరాలను వెంటనే నిలిపి వేయాలని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ నిర్ణయించింది. గత రెండు సంవత్సరాలుగా ధరలు పెంచక పోవడంతో నష్టాలు పెరిగాయని.. తెలంగాణ రాష్ట్రంలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల అమ్మకాలు నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
TGPSC | టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఫలితాలు విడుదల
TGPSC | మే 1 తర్వాతే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు : టీజీపీఎస్సీ
Group-3 | గ్రూప్-3 ప్రాథమిక కీ విడుదల చేసిన టీజీపీఎస్సీ