Harish Rao | రైతు భరోసా చిల్లర పంచాయితీనా ముఖ్యమంత్రి గారు..? సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ ఎలా ఉందంటే.. పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శత విధాలా ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.
Harish Rao | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ ఎలా ఉందంటే.. పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శత విధాలా ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. మీ ప్రెస్ రిలీజులు, మీ మీడియా కవరేజులు, మీ ఈనో స్టోరీలు ఎవరూ నమ్మడం లేదని చివరకు ప్రెస్‌మీట్ పెట్టావు అని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
ఎప్పుడో అయిపోయిన దావోస్‌కు ఇప్పుడు ఎందుకు ఈ దావతు. దావోస్‌లో జరిగే ఎంవోయూలు అన్నీ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే, ఎవరైనా ఓపెన్ టెండర్లో రావాల్సిందే.. అని ఆర్థిక మంత్రి భట్టి గారు అంటే, మీరేమో లక్షా 82 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు గప్పాలు చెబుతున్నారు. భట్టి గారు చెప్పింది నిజమా? మీ మాటలు నిజమా? రేవంత్ రెడ్డి గారూ.. అని హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు.
పొంతన లేకుండా మీరు చెప్పిన కంపెనీలు, పెట్టుబడుల లెక్కలు యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించింది. అంతా డొల్ల ప్రచారం అని తేలిపోయింది. రైతు భరోసా కోసం గంపెడు ఆశతో, కొండంత ఆందోళనతో ఎదురుచూస్తున్న రైతుల ఆరాటాన్ని చిల్లర పంచాయితీ అంటవా? ఇంతక ముందు రైతు బంధును బిచ్చం అన్నవు, ఇప్పుడు రైతు భరోసాను చిల్లర పంచాయతీ అంటున్నవు. సంక్రాంతికి ఇస్తానన్న సంగతి తేలిపోయింది, చబ్బీస్ (26) జనవరి చేదు మాత్రనే అయ్యింది, ఇప్పుడు మార్చి 31 దాకా గడువు పెంచినవు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
జర్నలిస్టులు ఇదేమని అడిగితే, చిల్లర పంచాయితీ అంటున్నవు. అప్పుల పాలవుతున్న రైతుల ఆవేదన పక్కన పెట్టీ మీ ప్రచారం వినాలా? రైతుల అప్పులు ముఖ్యమా.? దావోస్ డప్పులు ముఖ్యమా..? మీ సెల్ఫ్ డబ్బాకు, మీ వెకిలి సెటైర్లకు కాలం చెల్లింది. ఇకనైనా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి. నీలో అటెన్షన్ డిక్రీసింగ్ డిజార్డర్ మొదలైంది. నీ మాటలు ఎవరు నమ్మడం లేదనే ఆందోళన పెరిగిపోయింది. మంచి మానసిక వైద్యుడిని సంప్రదించడం మంచిది అని రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సిగ్గుందా అని అడుగుతున్నా : కేటీఆర్
KTR | రైతుబంధు కొనసాగిస్తే ఆయననెవరూ దేకరని రేవంత్‌రెడ్డి భయం : కేటీఆర్
KTR | రేవంత్‌రెడ్డి దృష్టిలో మోసం చేసుడు కూడా చారిత్రాత్మకమే : కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

