Harish Rao | హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ రాస్ట్రం ఏర్పడిన తర్వాత కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నాటి సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
“నమ్ముకొని పెత్తనము ఇస్తే
నమ్మకము పోగొట్టుకొంటివి
కుప్పకావలి ఉండి కట్టలు
తప్పదీస్తివి ముద్దెరేస్తివి”
అని కాళోజీ రాసిన కవితలు ప్రస్తుత కాలానికి వర్తిస్తున్నాయని హరీశ్‌రావు తెలిపారు.
“దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం”
అని కాళోజీ చెప్పిన మాటలే మాకు స్ఫూర్తి. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
ప్రజాకవి కాళోజీ గారి జయంతి
సందర్భంగా ఘన నివాళి.
తెలంగాణా భాషా దినోత్సవం శుభాకాంక్షలు.“నమ్ముకొని పెత్తనము ఇస్తే
నమ్మకము పోగొట్టుకొంటివి
కుప్పకావలి ఉండి కట్టలు
తప్పదీస్తివి ముద్దెరేస్తివి”అని కాళోజీ రాసిన కవితలు ప్రస్తుత కాలానికీ వర్తిస్తున్నాయి.
“దోపిడి చేసే ప్రాంతేతరులను… pic.twitter.com/dnR1bHMf4z
— Harish Rao Thanneeru (@BRSHarish) September 9, 2024
ఇవి కూడా చదవండి..
KCR | బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ: కేసీఆర్
KTR | కాళోజీ కలం.. సామాన్యుల గళం.. ప్రజలకు బలం: కేటీఆర్
Nalimela Bhaskar | సాహితీవేత్త నలిమెల భాస్కర్‌కు కాళోజీ పురస్కారం