మహబూబ్‌నగర్ అర్బన్, మార్చి 16 : పాలమూరు జిల్లా కేంద్రంలో సోమవారం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శాలువాలు, బొకేలు, గజమాలతో ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు వ్యతిరేకంగా బీసీల గళం ఎత్తి పోరాడుతున్న శీనన్న వెంట మేము ఉంటామని కార్యకర్తలు ప్రతినబూనారు. అంతకుముందు హైదరాబాద్‌లోని మాజీ మంత్రి నివాసానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మహబూబ్‌నగర్‌కు చేరుకున్న ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అంతకుముందు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సతీమణి శారద కుటుంబ సభ్యులతో కలిసి దివంగత తల్లిదండ్రుల సమాధుల వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాలకొండ వద్ద బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో భారీ కేక్‌ను కట్ చేసి పంపిణీ చేశారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాజీ మంత్రికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మం త్రి భారీ కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నర్సింహులు, గంజి వెంకన్న, ఆం జనేయులు, రెహమాన్, శివరాజ్, నరేందర్, దేవేందర్‌రెడ్డి, గణేశ్‌తోపాటు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.