Harish Rao | హైదరాబాద్ : సమస్య చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయంకు వెళ్లిన వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని నిలదీస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఇదేనా మీరు చెబుతున్న ప్రజా పాలన అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. సీఎం ఆదేశాలతో ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం పోలీసులకు అవసరమా? అని ప్రశ్నించారు.
నాడు లగచర్ల లంబాడి రైతన్నల చేతులకు బేడీలు వేశారు? నేడు ఖానాపూర్ లో వృద్ద రైతు మెడలు పట్టి గెంటేశారు? ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదన్న సంగతి మరిచిపోయి ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుపై చేయి వేసిన పోలీసుపై వెంటనే తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని, బేషరతుగా యావత్ తెలంగాణ రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సమస్య చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయంకు వెళ్లిన వృద్ధ రైతు పట్ల
ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా?ఇదేనా మీరు చెబుతున్న ప్రజా పాలన @revanth_anumula ?
సీఎం ఆదేశాలతో ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం పోలీసులకు అవసరమా?
నాడు లగచర్ల లంబాడి రైతన్నల చేతులకు బేడీలు వేశారు?
నేడు ఖానాపూర్… pic.twitter.com/5VsvKDfZSP— Harish Rao Thanneeru (@BRSHarish) June 4, 2025
ఇవి కూడా చదవండి..
TET Exam Schedule | తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
Ethanol factory | ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దంటూ వాహనాల ధ్వంసం.. పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత
Madhu Yashki | మాజీ ఎంపీ మధు యాష్కీ ఇంట్లో కాంగ్రెస్ నేతల లంచ్ మీటింగ్..! అసలేం జరుగుతుంది..?