TET Exam Schedule | హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 2025 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటీ ) పద్ధతిలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. రోజూ రెండు సెషన్లలో ఉ.9 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. ఈసారి టెట్‌కు 1,83,653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి ఎగ్జామ్ షెడ్యూల్ కోసం టెట్ వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.