అలంపూర్: మానవ మనగడకు నిప్పు పెట్టే ఇథనాల్ కంపెనీ (Ethanol factory) మాకొద్దని కంపెనీ చుట్టుపక్కల గ్రామాల రైతులు ఊరు వాడ , ఆడ, మగ కర్ర పట్టి కదిలింది. గుంపులుగా దండు కదిలి అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal district) రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీ మాకొద్దు అంటూ మహిళా రైతులు నినాదాలు చేస్తూ కంపెనీ ప్రదేశానికి వెళ్లి అడ్డుకున్నారు. వీరికి సంఘీభావంగా మూడు వేల మంది రైతులు ఆందోళనలో పాల్గొని కంపెనీ ఏర్పాటు చేసిన తాత్కాలిక కంటైనర్లు, వాహనాలను ధ్వంసం ( Vehicles destroyed) చేశారు. కొన్నింటికి నిప్పు పెట్టారు. మోహరించిన పోలీసులు కంట్రోల్ చేయలేక పోయారు. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇథనాల్ ఫ్యాక్టరీ పేరుతో తమ భూములను కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్, వాణిజ్య వ్యాపారాల కోసం భారీ మొత్తంలో పొలాలు కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఫ్యాక్టరీ యాజమాన్యానికి వత్తాసు పలకడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా రైతులకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాల నాయకులను, రైతు సంఘం నాయకులను ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేయించడం దారుణమని రైతులు పేర్కొన్నారు.
ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే అడ్డుకుంటామని రైతులు తీవ్రంగా హెచ్చరించారు. గతంలో కంపెనీ నిర్మాణానికి వ్యతిరేకంగా రిలే నిరాహారదీక్షలు దీక్షలు చేపట్టిన సమయంలో దీక్ష శిబిరాన్ని సందర్శించి ఇచ్చిన హామీలను ఆయా రాజకీయ పార్టీల నాయకులు విస్మరించారని ఆరోపించారు.