Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో కుండపోతగా కురిసిన వర్షాలకు ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇంట్లో వరద నీరు.. కళ్లల్లో ఎడతెగని కన్నీరు ప్రవహిస్తుందన్నారు. వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు, కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోవడం పై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలని హరీశ్‌రావు సూచించారు. ఇప్పటికే తక్షణ సహాయ చర్యలు అందలేదని జనం తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం బాధ్యతాయుతంగా మనసుపెట్టి చర్యలు తీసుకోవాలి. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలి. విద్యుత్ సరఫరాను పునర్దరించాల్సిన చోట వేగంగా చర్యలు తీసుకోవాలి. ఆహారం, నీరు అందుబాటులో ఉంచాలి. అసలే రాష్ట్రం విష జ్వరాలతో విలువిలలాడుతున్నది. వరదల వల్ల మరింత విజృంభించే ప్రమాదం ఉంది. అన్ని శాఖలు అప్రమత్తం కావాలి. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నారు సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంట్లో వరద నీరు, కంట్లో ఏడతెగని కన్నీరు. వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది.
ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు,
కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోవడం పై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలి.…— Harish Rao Thanneeru (@BRSHarish) September 2, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌కు బీజేపీ నేతల బెదిరింపులు.. ఖండించిన హరీశ్‌రావు
TGDRF | విపత్తులను ఎదుర్కొనేందుకు టీజీడీఆర్ఎఫ్ ఏర్పాటు : సీఎం రేవంత్ రెడ్డి