Harish Rao | మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌కు బీజేపీ నేతల బెదిరింపులు.. ఖండించిన హరీశ్‌రావు
Harish Rao | మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు కే నాగేశ్వర్‌పై కొంతమంది బీజేపీ నాయకులు చేస్తున్న అనుచిత దాడి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao | హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు కే నాగేశ్వర్‌పై కొంతమంది బీజేపీ నాయకులు చేస్తున్న అనుచిత దాడి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. రాజకీయ విమర్శలను జవాబుగా రాజకీయ విమర్శలతోనే ఎదుర్కోవాలి అని సూచించారు. అంతేగానీ, అందుకు భిన్నంగా భౌతిక దాడులు చేస్తామని, బయట తిరగనివ్వబోమని బెదిరిస్తూ తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా దుర్భాషలాడటం గర్హనీయం. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..?
రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఓ వీడియో విడుదల చేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఈటల రాజేందర్ తనపై చౌకబారు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ‘నేను ఏ వీడియోలో రేవంత్‌రెడ్డి గొప్ప సంఘ సంస్కర్త, ప్రగతి కాముకుడు అని చెప్పానో చూపాలి. లేకపోతే పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనా మా చేయాలి. కాదంటే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. హైడ్రా విషయంలో బీజేపీ వైఖరి ఏంటో చెప్పి.. ఆ తర్వాత మాట్లాడండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్ను వీడిన తర్వాత ఈటల రాజేందర్ నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో చర్చలు జరిపింది నిజం కాదా? ఇకముందు కూడా కాంగ్రెస్‌లో చేరబోనని గ్యారెంటీ ఇవ్వగలరా..? శాశ్వతంగా బీజేపీలోనే ఉంటానిని చెప్పగలరా..? ఇతరులపై చౌకబారు వ్యాఖ్యలు చెప్పేముందు గతం ఒక్కసారి చూసుకోవాలి’ అంటూ నాగేశ్వర్ హితవు పలికారు.
మంత్రిగా మాట్లాడలేదేమీ?
‘బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ బడాబాబుల అక్రమాలపై ఎందుకు మాట్లాడలేదు..? నేను ఎప్పట్నుంచో పేదల గురించి మాట్లాడుతున్నా. ఉద్యమకాలం నుంచి ఎన్ కన్వెన్షన్, పద్మాలయ స్టూడియో, లగడపాటి ల్యాంకోహిల్స్, అయ్యప్పసొసైటీ వంటి వాటి పై గళమెత్తాను. నాడు ఎమ్మెల్సీగా జిల్లెలగూడ చెరువు, మంత్రాల చెరువు, మీర్పేట్ చెరువుల గురించి ప్రస్తావించా. మేము పేదల గురించి పోట్లాడుతుంటే మీరు ఎక్కడున్నారు ఈటల రాజేందర్?’ అని ప్రశ్నించారు. ఈటల కంటే ముందే.. హైడ్రా కమిషనర్‌తో పేదల ఇండ్ల గురించి ప్రస్తావించినట్టు చెప్పారు. తాను జెండాలు, ఎజెండాలు మార్చే సూడో పొలిటీషియన్‌ను కాదని, తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేదంటే రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్సీ రాజకీయ విశ్లేషకులు @K_Nageshwar గారిపై కొంతమంది బిజెపి నాయకులు చేస్తున్న అనుచిత దాడి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
రాజకీయ విమర్శలను జవాబుగా రాజకీయ విమర్శలతోనే ఎదుర్కోవాలి. అంతేగానీ, అందుకు భిన్నంగా భౌతిక దాడులు చేస్తామని, బయట తిరగనివ్వబోమని బెదిరిస్తూ తన…
— Harish Rao Thanneeru (@BRSHarish) September 2, 2024
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణకు కష్టమొచ్చిందంటే ముందుండేది బీఆర్ఎస్సే.. కేటీఆర్ ట్వీట్
Viajayawada Rains | వరదలో మునిగిపోయిన విజయ డెయిరీ.. 70 కోట్ల నష్టం!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

